Philips S7221 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌లో అమ్మకానికి సిద్ధమైంది. ఈ ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,499 కాగా, 8GB+128GB వేరియంట్ ధర రూ. 22,499గా కంపెనీ నిర్ణయించింది. వినియోగదారులు ఈ ఫోన్‌ను బ్లాక్, బ్లూ, యాష్ రంగుల్లో అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ 6.67-అంగుళాల HD LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 720×1,600 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ లోపల ఆక్టా-కోర్ స్ప్రెడ్‌ట్రమ్ T765 చిప్‌సెట్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
కెమెరా విషయానికి వస్తే, ఫోన్ వెనుక భాగంలో 64MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16MP కెమెరాను అందించారు. ఇందులో ఏఐ సీన్ ఆప్టిమైజేషన్, పోర్ట్రెయిట్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఫోన్‌లో 5,700mAh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు, ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP64 రేటింగ్ ఇచ్చారు. భద్రత కోసం ఫోన్ పక్క భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు.
ఆడియో కోసం అల్ట్రా మాక్స్ మోడ్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను ఇందులో చూడవచ్చు. కనెక్టివిటీ కోసం 5G, వైఫై, బ్లూటూత్, టైప్-సి పోర్ట్‌తో పాటు డ్యూయల్ నానో సిమ్ సదుపాయం ఉంది. ఫోన్ 166mm పొడవు, 77mm వెడల్పు, 8.95mm మందంతో 200 గ్రాముల బరువు ఉంటుంది.








