వీరు వులవల దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమైన చిత్రం 'పురుష'. స్వేచ్ఛ కోసం భర్త చేసే పోరాటం అనే కథాంశంతో కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మే 22న థియేటర్లలో విడుదలైంది. బ్రహ్మచారిగా ఉన్న హీరో పెళ్లి తర్వాత ఎదుర్కొనే పరిస్థితుల చుట్టూ ఈ కథ సాగుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. థియేటర్లలో సినిమాను చూడని ఫ్యామిలీ ఆడియెన్స్ ఇప్పుడు ఓటీటీలో ఈ చిత్రాన్ని చూస్తున్నారు. విడుదలైన కొన్ని రోజులకే ఈ మూవీ ఓటీటీలో ట్రెండింగ్‌లో నిలిచి ప్రేక్షకులను అలరిస్తోంది.

ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, వీటీవీ గణేశ్, అనంత్ శ్రీరామ్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, మిర్చి కిరణ్, గబిరాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషించారు. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ హీరోయిన్లుగా నటించారు.

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రతి ఇంట్లో వినిపించే కథ కావడంతో, ప్రేక్షకులు ఈ సినిమాలోని భావోద్వేగాలను, నవ్వులను ఆస్వాదిస్తున్నారు.