న్యూయార్క్ పర్యటనకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెటన్యాహును అరెస్టు చేయాలని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మాండానీ డిమాండ్ చేశారు. నెటన్యాహు నగరానికి వచ్చిన వెంటనే ఆయన్ని అదుపులోకి తీసుకోవాలని మాండానీ కోరడం వివాదాస్పదంగా మారింది.
అంతర్జాతీయ క్రైమ్ కోర్టు (International Criminal Court) నెటన్యాహు మరియు ఆయన అధికారులపై ఇప్పటికే అరెస్టు వారంట్ జారీ చేసింది. ఈ కేసులో నెటన్యాహు నిందితుడిగా ఉన్నారని మేయర్ గుర్తు చేశారు. నెటన్యాహు ఈ వారంలో న్యూయార్క్‌కు రానున్నట్లు సమాచారం.
మేయర్ మాండానీ వ్యాఖ్యలపై నెటన్యాహు తీవ్రంగా స్పందించారు. తనను అరెస్టు చేయాలని కోరడం ద్వారా మేయర్ హేట్ స్పీచ్‌కు పాల్పడ్డారని నెటన్యాహు ఆరోపించారు. ఈ పరిణామాలతో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదురుతోంది.





