ఎన్నో తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకులను అలరించిన ప్రగతి, కొంతకాలంగా సినిమాలకు విరామం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో శిక్షణ తీసుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆమె రాష్ట్ర, దేశ మరియు ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఇప్పటికే వెయిట్ లిఫ్టింగ్‌లో వివిధ కేటగిరీల కింద అనేక అవార్డులను ప్రగతి సొంతం చేసుకున్నారు.
తాజాగా జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఆమె పాల్గొన్నారు. ఈ పోటీలో తాను వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పటి ఫోటోలను ప్రగతి స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.








