నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మంగళవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు తీరును ఆయన స్వయంగా ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.
బస్టాండ్‌లోని దుకాణాల్లో వస్తువుల ధరలను ఎమ్మెల్యే పరిశీలించారు. గరిష్ట రిటైల్ ధర (MRP) కంటే ఎక్కువకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణదారులను హెచ్చరించారు. ప్రయాణికులను దోచుకుంటే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
బస్టాండ్ ఆవరణలో అపరిశుభ్రత, బాత్రూమ్‌లు, తాగునీటి సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు. అలాగే, బస్టాండ్ ఆవరణలో అడ్డదిడ్డంగా పార్క్ చేసిన బైకులను వెంటనే తొలగించాలని పోలీస్ అధికారులకు సూచించారు. పార్కింగ్ కోసం ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డీఎంను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య సూచించారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది, ఆర్టీసీ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చర్యలతో బస్టాండ్‌లో వెంటనే కదలిక రావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.








