ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోమరం భీం ఆదివాసీ భవన్‌ను సందర్శించనున్నారు. ఈ పర్యటన కారణంగా బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు గుర్తించారు.

ముఖ్యంగా బాసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రోటరీ నుంచి రోడ్ నంబర్ 9 మరియు 10 మార్గాల్లో వాహనాల రాకపోకలకు ఆటంకం కలగవచ్చు.

మాసాబ్ ట్యాంక్, తాజ్ కృష్ణ హోటల్ వైపు నుంచి రోడ్ నంబర్ 10, జెహ్రా నగర్ మీదుగా ఎన్టీఆర్ భవన్ లేదా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

ప్రయాణికులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నెంబర్ 9010203626ను సంప్రదించాలని పోలీసులు కోరారు.