ములుగులో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, దసరా పండుగకు మహిళలకు చీరలు కానుకగా ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చకుండా గొప్పలు చెప్పుకుంటున్నారని అక్కడి మహిళలు సభలోనే నిలదీశారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి, ప్రస్తుతం రూ.1,050 వసూలు చేస్తున్నారని వారు మండిపడ్డారు.

మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించే మహాలక్ష్మి పథకం ఏమైందని, దివ్యాంగులు మరియు వితంతువుల పింఛన్లు ఎందుకు పెంచలేదని మహిళలు ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాల