శుక్రవారం సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది. రాత్రి 9 గంటల తర్వాత నగరంలో వర్షం మొదలైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, బేగంపేట, కొండాపూర్, అమీర్‌పేట వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఈ వర్షం కారణంగా నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో చినుకు లేక ఉక్కపోతను అనుభవిస్తున్న నగరవాసులకు ఈ వాన కొంత ఉపశమనాన్ని అందించింది.
తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా ప్రకారం, రాబోయే ఒకటి రెండు గంటల్లో పశ్చిమ మరియు ఉత్తర హైదరాబాద్‌లోని మియాపూర్, పటాన్‌చెరు, లింగంపల్లి, చందానగర్, బిహెచ్‌ఇఎల్ (BHEL), తెల్లాపూర్, నల్లగండ్ల, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.








