దివంగత నందమూరి జానకిరామ్ భార్య నందమూరి దీపిక మేహతాబ్‌ఖాన్‌గూడెం గ్రామస్థుల ఆహ్వానం మేరకు అక్కడ నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గత కొన్నాళ్లుగా నందమూరి దీపిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజలతో మమేకమవుతున్న ఆమె, త్వరలోనే రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ పండుగ వేడుకల్లో గ్రామస్థులతో కలిసి ఆమె దిగిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి.








