మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న ఈ కొత్త సినిమాను భైరవకాళి బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. లెల్లా రోహిత్ దర్శకత్వం వహిస్తుండగా, లెల్లా రాహుల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మేఘాంశ్ శ్రీహరి తెలంగాణ సంస్కృతిలో భాగమైన పోతురాజు వేషధారణలో కనిపిస్తున్నారు. ఆయన వెనుక శ్రీహరి కూడా అదే పోతురాజు ఆహార్యంలో ఉండటం విశేషం.
ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.
గతంలో రాజ్ దూత్, కోతికొమ్మచ్చి సినిమాల్లో నటించిన మేఘాంశ్, ప్రస్తుతం స్టూడెంట్ సినిమా టీజర్‌తో పాటు ఆస్మాన్ అనే మరో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.








