రాజకీయ అంశాలకు దూరంగా ఉంటూ, ప్రస్తుతం సినిమాలపైనే త్రిష దృష్టి పెడుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆమె పేరు రాజకీయ వర్గాల్లో తరచూ వినిపిస్తున్నప్పటికీ, త్రిష మాత్రం తన వృత్తిపరమైన పనుల్లో బిజీగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే త్రిష కొత్త సినిమా బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంతో బాలీవుడ్‌కు చెందిన పనోరమా స్టూడియో అనే నిర్మాణ సంస్థ, తమిళ సినిమా రంగంలోకి అడుగుపెడుతోంది.
‘ఎయిర్‌లిఫ్ట్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజాకృష్ణ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అని చిత్ర బృందం వెల్లడించింది.
ఈ సినిమాలో త్రిష పాత్ర గతంలో ఆమె చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, అపర్ణ బాలమురళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.








