పీర్జాదిగూడకు చెందిన 51 ఏళ్ల సత్యనారాయణ ఈ నెల 6న రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చి మద్యం సేవించాడు. ఆ సమయంలో భార్య సునీతతో గొడవ జరగడంతో ఆమె అతడిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. సత్యనారాయణ చేతులు, కాళ్లను చీరతో కట్టేసి సెంట్రింగ్ కర్రతో కొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు.

భర్త స్పృహ కోల్పోయిన తర్వాత, సునీత తన కొడుకు నిఖిత్‌కు ఫోన్ చేసి సత్యనారాయణ వాహనం నుంచి జారిపడి గాయపడ్డాడని అబద్ధం చెప్పింది. కుటుంబ సభ్యులు అతడిని బోడుప్పల్‌లోని ఒక ఆసుపత్రికి, ఆపై గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, సత్యనారాయణ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

పోలీసులు పోస్టుమార్టం నివేదికను, ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి సునీతపై అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి, చట్టపరమైన విచారణ కోసం రిమాండ్‌కు తరలించారు.