వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ఇబ్రహీంపట్నం పోలీసులు గృహ హింస కేసు నమోదు చేశారు. జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ భార్య మేఘన స్వయంగా పోలీసులను ఆశ్రయించి, తనను కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు.
మేఘన ఇచ్చిన ఫిర్యాదును ప్రాథమిక ఆధారంగా తీసుకున్న పోలీసులు, గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు ఆయన కుటుంబానికి చెందిన మొత్తం 11 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ (FIR) దాఖలు చేశారు.
బాధితురాలు మేఘన చేసిన ఆరోపణలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు.








