సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భారతీ ముఖి, తన సహోద్యోగి పూజా అశోక్‌తో కలిసి భోజనం కోసం ఐటీసీ కోహినూర్ ప్రాంతానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ ముందు భారతీ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
సంజుష్ అనే వ్యక్తి నడుపుతున్న కారు వేగంగా, అజాగ్రత్తగా వచ్చి భారతీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్రమైన రక్తస్రావం జరగడంతో పరిస్థితి విషమించింది.
ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను అదే కారులో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమెను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.
ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు ఫిర్యాదు అందుకున్నారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.








