‘పుష్ప 2’ సినిమా 2024 డిసెంబర్‌లో విడుదల కాగా, రెండేళ్ల నుంచి రామ్‌చరణ్ సినిమా కథ రాసే పనిలోనే సుకుమార్ ఉన్నాడు. అదిగో ఇదిగో అంటూ ఎట్టకేలకు ‘ఆర్సీ 17’ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ గుజరాతీ సినిమా ‘లాలో’ను పోలి ఉండడంతో రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది. ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్‌లో నెమలి పింఛంలో మనిషి ఆకారాన్ని మిక్స్ చేశారు. కేవలం 50 లక్షల రూపాయల బడ్జెట్‌తో తయారైన ‘లాలో’ సినిమా 122 కోట్లు కలెక్ట్ చేయగా, ఇప్పుడు ఈ గుజరాతీ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతోంది.
ఈ రీమేక్ సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్ రెండేళ్ల నుంచి కష్టపడుతున్నాడా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే కథ నిజంగానే వేరా లేదంటే ఈ పోస్టర్ యాదృచ్ఛికంగా కలిసిందో లేదో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
‘ఆర్సీ 17’ సినిమాలో రామ్‌చరణ్ లుక్ ఎలా ఉంటుందనేది ఇంకా స్పష్టత రాలేదు. ‘పెద్ది’ సినిమాలో కనిపించిన లుక్ నుంచి ఆయన బయటకు రాలేదు. ఓపెనింగ్ రోజు లాంగ్ హెయిర్, గడ్డంతోనే రామ్‌చరణ్ కనిపించాడు.
రెగ్యులర్ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేకపోవడంతో, ఈలోగా సుకుమార్ స్టైల్‌లో స్టైలిష్ లుక్‌లోకి వస్తాడేమో చూడాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే ప్రశ్నలకు ఓపెనింగ్ రోజే సమాధానం దొరుకుతుంది అనుకుంటే మేకర్స్ సీక్రెసీ మెయింటైన్ చేశారు.
సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో మరొకరు ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. దేవిశ్రీని కాదని ఎవరిని తీసుకుంటాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పటికీ, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ప్రకటించలేదు. అలాగే భాగ్యశ్రీ బోర్సే, సాత్వికా వీరవల్లి అంటూ చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించినా, ఆ ముద్దుగుమ్మ ఎవరనే విషయాన్ని బయటపెట్టలేదు.








