అమెరికాలో ఉన్న Fairlife డెయిరీ ఉత్పత్తి కేంద్రాలపై సైబర్ నేరగాళ్లు రాన్సమ్‌వేర్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో కంపెనీకి చెందిన ఉత్పత్తి వ్యవస్థలు దెబ్బతినడంతో, ప్లాంట్లలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు Coca-Cola ప్రకటించింది.
అయితే, కెనడాలో నడుస్తున్న Fairlife కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈ దాడి వల్ల వ్యాపారంపై ఎంత మేర ప్రభావం పడుతుందనేది ఇంకా స్పష్టత రాలేదని కంపెనీ పేర్కొంది. 2024 నాటికి సుమారు 4 బిలియన్ డాలర్ల అమ్మకాలను సాధించిన ప్రధాన బ్రాండ్‌లలో Fairlife ఒకటి.
ప్రస్తుతానికి సిస్టమ్‌లను ఎప్పటిలోగా పునరుద్ధరిస్తామనే దానిపై కంపెనీ ఎటువంటి గడువును ప్రకటించలేదు. గతంలో కూడా పలు ఆహార, పానీయాల కంపెనీలపై జరిగిన ఇలాంటి రాన్సమ్‌వేర్ దాడుల వల్ల వారాల తరబడి ఉత్పత్తికి అంతరాయం కలిగిన సందర్భాలు ఉన్నాయి.







