ప్రతి ఇయర్‌ఫోన్ కేవలం 5.2 గ్రాముల బరువుతో ఉండేలా వీటిని తయారు చేశారు. 2,000కి పైగా హ్యూమన్ ఇయర్ మోడల్స్ (మానవ చెవి ఆకృతులు) ఆధారంగా వీటిని ఎర్గోనామిక్ డిజైన్‌తో రూపొందించారు. దీనివల్ల ఎక్కువసేపు పెట్టుకున్నా చెవులకు ఇబ్బంది ఉండదు. అలాగే, లెఫ్ట్, రైట్ అనే తేడా లేకుండా సింమెట్రికల్ డిజైన్‌ను ఇందులో ఇచ్చారు.

టైటానియం మెమరీ అల్లాయ్‌తో C-బ్రిడ్జ్‌ను తయారు చేశారు. పర్పుల్, వైట్ రంగుల్లో లభించే ఈ ఇయర్‌ఫోన్స్ పర్ల్ తరహా ఫినిషింగ్‌తో వస్తాయి. ఆడియో నాణ్యత కోసం 12mm డ్యూయల్-కాయిల్ డ్రైవర్‌ను అమర్చారు. Hi-Res ఆడియో వైర్‌లెస్ సర్టిఫికేషన్‌తో పాటు 10-బ్యాండ్ ఈక్వలైజర్, స్పేషియల్ ఆడియో వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా మూడు ప్రత్యేక ఆడియో మోడ్‌లను అందించారు. బ్యాలన్సడ్ మోడ్ సౌండ్, పవర్ వినియోగం మధ్య సమతుల్యతను చూస్తుంది. వోకల్ ఎన్హన్సమెంట్ మోడ్ వాయిస్ స్పష్టతను పెంచగా, లీకేజీ ప్రూఫ్ మోడ్ బయటకు శబ్దం వెళ్లకుండా అడ్డుకుంటుంది. కాల్స్ కోసం డ్యూయల్ మైక్ సిస్టమ్, బీమ్‌ఫార్మింగ్, AI నాయిస్ రిడక్షన్ టెక్నాలజీని వాడారు.

ట్రాఫిక్, కీబోర్డ్, హార్న్ వంటి శబ్దాలను తగ్గించే సామర్థ్యం దీనికి ఉంది. VPU బోన్ కండెక్షన్ మైక్ అంటే ఎముకల ప్రకంపనల ద్వారా వాయిస్‌ను గుర్తించే మైక్రోఫోన్ ద్వారా స్పష్టమైన కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. ఒకేసారి మూడు డివైస్‌లకు వీటిని కనెక్ట్ చేసుకోవచ్చు. IP55 రేటింగ్ ఉండటంతో దుమ్ము, నీటి నుంచి ఇవి రక్షణ పొందుతాయి.

మొత్తం 42 గంటల ప్లేబ్యాక్ సామర్థ్యం ఉండగా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 గంటల వరకు వాడుకోవచ్చు. 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జ్‌తో 3 గంటల ప్లేబ్యాక్ వస్తుంది. Qi వైర్‌లెస్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. AI స్మార్ట్ ట్రాన్స్‌లేషన్, స్మార్ట్ బ్రాడ్‌కాస్ట్, రిమోట్ ఫోటో కంట్రోల్ వంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

స్టాండర్డ్ వర్షన్ ధర 699 యువాన్లు అంటే సుమారు రూ.10,000గా నిర్ణయించారు. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న వర్షన్ ధర 799 యువాన్లు అంటే సుమారు రూ.11,435గా ఉంది.