వాస్తు శాస్త్రం, వశిష్ఠ సంహితలోని సూచనల ప్రకారం ఇంట్లో ఐశ్వర్యం నెలకొల్పడానికి చీపురు కొనుగోలులో కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. కృష్ణ పక్షం (బహుళ పక్షం)లో కొత్త చీపురును ఇంటికి తీసుకురావడం వల్ల దారిద్ర్యం తొలగి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని నమ్మకం.

ముఖ్యంగా మంగళవారం, శనివారం, అమావాస్య రోజుల్లో కొత్త చీపురు కొనడం అత్యంత మంగళకరమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ధన్తేరస్ రోజున కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. అంతేకాదు, చీపురును విడిగా కాకుండా కట్ట (బండిల్) రూపంలో కొనడం వల్ల శుభఫలితాలు ఉంటాయని వశిష్ఠ సంహిత పేర్కొంది.

మరోవైపు, శుక్ల పక్షంలో కొత్త చీపురు కొనడం దురదృష్టమని వాస్తు నమ్మకాలు చెబుతున్నాయి. అలాగే సోమవారం రోజున కొత్త చీపురును కొనుగోలు చేయకూడదని సూచిస్తారు. పాత చీపురును తొలగించే విషయంలో కూడా జాగ్రత్త వహించాలి.

గురువారం లేదా ఏకాదశి రోజున పాత చీపురును బయట పడేయడం మంచిది కాదని, దీనివల్ల లక్ష్మీ కటాక్షం తగ్గుతుందని నమ్ముతారు. ఈ విషయాలు కేవలం సంప్రదాయ విశ్వాసాలు, వాస్తు శాస్త్రంపై ఆధారపడి ఉన్నాయని, వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించాలి.