భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం కొత్త అంజినాపురంలో ఈ ఘటన జరిగింది. రెండు రోజుల క్రితం నర్రా అజయ్ అనే రైతుకు చెందిన పొలంలో 20 మంది కూలీలు కలుపు తీసే పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో పొలం యజమాని మొక్కలపై పురుగుమందు స్ప్రే చేశారు.

పురుగుమందు స్ప్రే చేసిన సమయంలో కూలీలు అక్కడే ఉండటంతో, ఆ మందు కళ్లలో, ముక్కుల్లో పడింది. ఆ ఘాటైన వాసన పీల్చడంతో కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంటికి వెళ్లిన తర్వాత వారికి వాంతులు, విరోచనాలు కావడంతో కుటుంబ సభ్యులు వారిని బుధవారం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆస్పత్రిలో 14 మంది కూలీలు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూ (ICU)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 12 మంది పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు వెల్లడించారు.