తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు పుష్పగుచ్ఛం అందించి, గార్డ్ ఆఫ్ హానర్‌తో ఘన స్వాగతం పలికారు.

ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించడంపై బక్కి వెంకటయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆయన స్వామివారిని కోరుకున్నారు.

ప్రతి ఏటా వేలాది మంది భక్తులు దీక్షలు చేపట్టి, కొండగట్టు అంజన్నను దర్శించుకుని ఆశీస్సులు పొందుతుంటారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లతతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.