గంపలగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు బుధవారం కనుమూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలతో మాట్లాడారు. రైతుల సంక్షేమం, మహిళా సాధికారత మరియు యువతకు ఉపాధి అవకాశాలు కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కోసం చేసిన కృషిని ఆయన ప్రజలకు వివరించారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, అర్హులకు అందిన సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ విజయాల పత్రాలను పంపిణీ చేశారు.

ప్రజల మధ్యలో పార్టీ శ్రేణులు ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.