మంత్రి పదవి నుంచి తొలగించబడిన కొండా సురేఖకు కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా ఆంక్షలు విధిస్తోంది. గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా ఆమోదంతో దేవాదాయ శాఖ మంత్రి పదవిని కోల్పోయిన సురేఖకు, ప్రభుత్వం తాజాగా భద్రతను కుదించింది.
శుక్రవారం అధికారులు ఆమెకు కేటాయించిన గన్‌మెన్లను వెనక్కి పిలిచారు. మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆమెకు కల్పించిన 4+4 భద్రతను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది.
అంతేకాదు, ఆమె వాడుతున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 3, గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.
తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, ఢిల్లీలోని పార్టీ పెద్దల నిర్ణయంతో సురేఖ మంత్రి పదవిని కోల్పోయారు. తనను అన్యాయంగా తొలగించారని ఇప్పటికే ఆరోపిస్తున్న సురేఖ, తాజాగా జరిగిన ఈ పరిణామాలతో మరింత ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.






