మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించినందుకు తన క్యాడర్ బాధపడుతోందని, ఆయారాం.. గాయారాంలకు భయపడేది లేదని రాజగోపాల్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. తుంగతుర్తిలో తప్పుడు వ్యక్తికి టికెట్ ఇప్పించానని, తనను గెలిపించిన కార్యకర్తలకు క్షమాపణ చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మందుల సామేల్ స్పందిస్తూ రాజగోపాల్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు.

రాజగోపాల్ రెడ్డి కంటే తాను ముందుగానే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని సామేల్ గుర్తు చేశారు. మునుగోడులో తనకు కూడా క్యాడర్ ఉందని, తన నియోజకవర్గంలో పర్యటించినప్పుడు కనీసం తనకు సమాచారం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. రోడ్డు పరిశీలన సమయంలో కూడా తనతో మాట్లాడలేదని సామేల్ అసహనం వ్యక్తం చేశారు.

కేవలం రెడ్లు, దళితులతోనే రాజ్యం నడవదని సామేల్ వ్యాఖ్యానించారు. తనకు టికెట్ ఇచ్చేది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) అని, రాజగోపాల్ రెడ్డి కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.