మీన రాశి వారికి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బు రాక మొదలవుతుంది, అలాగే ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి. అయితే, షేర్లు మరియు ఇతర పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఈ రాశి వారు శ్రీ కాత్యాయని అమ్మవారిని ఆరాధించి, మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పూలతో పూజించడం మంచిది.
కుంభ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపార భాగస్వాములతో ముఖ్యమైన విషయాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది. నాయకులతో విభేదాలు తగ్గించుకోవాలని, అప్పులు చేయకుండా జాగ్రత్త పడాలని సూచించారు. వీరు శ్రీ నాగేంద్ర స్వామిని ఆరాధించి, ఆయనకు క్షీరాభిషేకం నిర్వహించడం శుభప్రదం.
కర్కాటక రాశి వారికి భూమికి సంబంధించిన పనుల్లో అనుకూలతలు కనిపిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది, ప్రశాంతమైన మనసుతో పనులు పూర్తి చేస్తారు. వీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించి, కనకధారా స్తోత్రం పఠించడం మంచిదని పండితులు తెలిపారు.








