బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు పుట్టినరోజు వేడుకలను ఖతార్‌లోని పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను పార్టీ నాయకులు చేపట్టారు.

ఖతార్‌లోని కమ్యూనిటీ ఫ్రిజ్‌లను ఆహార పదార్థాలు మరియు నిత్యావసర వస్తువులతో నింపారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ నాయకులు తెలిపారు. దీనితో పాటు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో శ్రీధర్ అబ్బగౌని, ఎల్లయ్య తాళ్లపెల్లి, గడ్డి రాజు, హఫేఙ్ మహామ్మద్, ప్రవీణ్, సాగర్ దుర్గం, హఫీజ్, ప్రశాంత్, శంకర్, సుధాకర్, ప్రసాద్ మరియు రాజేష్ పాల్గొన్నారు.