తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్రస్థాయి ఇంటర్-డిస్ట్రిక్ట్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఎంపికలను నిర్వహిస్తోంది. డిసెంబర్ 2న ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు ఈ ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయి.
అండర్-10, అండర్-13, అండర్-15 విభాగాలలో బాలురు, బాలికల కోసం ఈ సెలక్షన్లు జరుగనున్నాయి. ఇండియన్ రౌండ్, రికర్వ్, కాంపౌండ్ డివిజన్లలో ఈ ఎంపికలు ఉంటాయని జనరల్ సెక్రటరీ పి. శంకరయ్య తెలిపారు.
అండర్-10 క్రీడాకారులు జనవరి 1, 2017 తర్వాత, అండర్-13 వారు జనవరి 1, 2014 తర్వాత, అండర్-15 వారు జనవరి 1, 2012 తర్వాత జన్మించి ఉండాలని అర్హత నిబంధనలు పేర్కొన్నారు. పాల్గొనే క్రీడాకారులు తమ పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు, ఆర్చరీ పరికరాలతో ఉదయం 8 గంటలకు వేదిక వద్దకు రావాలని సూచించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పీఈటీలు, ఆర్చరీ కోచ్లు, తల్లిదండ్రులు అర్హులైన పిల్లలను ఈ ఎంపికలకు ప్రోత్సహించాలని అసోసియేషన్ కోరింది. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. సారంగాపాణి ఈ వివరాలను తెలియజేశారు.








