కంకిపాడు మండల కేంద్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ 185వ బూత్ కన్వీనర్ నీరుకొండ సుబ్బారావుకు ఉత్తమ కార్యకర్త అవార్డు దక్కింది. సోమవారం కంకిపాడులో పర్యటించిన పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చేతుల మీదుగా సుబ్బారావు ఈ అవార్డును స్వీకరించారు.
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న కార్యకర్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో, పలువురు కార్యకర్తలకు ఈ సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు సుబ్బారావును అభినందించారు.
అవార్డు అందుకున్న అనంతరం నీరుకొండ సుబ్బారావు స్పందిస్తూ, పార్టీ అభివృద్ధి కోసం తన వంతు కృషిని మరింతగా కొనసాగిస్తానని పేర్కొన్నారు.







