జూబ్లీహిల్స్ బంగారు దొంగతన కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.
కర్ణాటకకు చెందిన హరీశ్, ఆకాశ్ సోదరులు హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం వచ్చి స్థిరపడ్డారు. హరీశ్ గురుకృప ఎక్స్ పోర్ట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఆకాశ్ హైటెక్ సిటీలో ఐటీ కంపెనీలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నాడు.
ఇంటి నిర్మాణం, పెళ్లి ఖర్చులతో అప్పుల పాలైన హరీశ్, సంస్థ నుండి బంగారం దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. బాత్రూమ్ గ్రిల్స్ తొలగించి, లాకర్‌లోని 1.029 కిలోల బంగారాన్ని అపహరించాడు. ఈ పని తమ్ముడు ఆకాశ్‌కు సహాయం చేశాడు.
సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసింది. రూ.1.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.






