గద్వాల జిల్లా ఐజ మండలం భూంపురం గ్రామ శివారులోని చిన్నోనిపల్లి కాల్వ కల్వర్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ద్విచక్రవాహనంపై గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తనిఖీల్లో అనిల్, విష్ణు అనే వ్యక్తుల వద్ద 77 గ్రాముల గంజాయిని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అనిల్ తన సొంత పొలంలోనే ఈ గంజాయిని సాగు చేసినట్లు ఐజ ఎస్సై గురుస్వామి వెల్లడించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులిద్దరిని రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.