టెలికాం సంస్థ రిలయన్స్ జియో, ప్రముఖ గ్రాఫిక్ డిజైన్ ప్లాట్‌ఫాం Canvaతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సెప్టెంబర్ 15 నుంచి రూ. 349 లేదా రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
రూ. 349 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే, Canva ప్రో లైట్ సేవలు 12 నెలల పాటు ఉచితంగా లభిస్తాయి. ఇందులో ప్రీమియం టెంప్లేట్లు, బేసిక్ బ్రాండ్ కిట్లు, బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్, ప్రింట్ రెడీ ఎక్స్‌పోర్ట్స్ వంటి సౌకర్యాలతో పాటు 50 జీబీ క్లౌడ్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది.
రూ. 399 ప్లాన్‌ను ఎంచుకునే కస్టమర్లకు Canva ప్రో సేవలు ఏడాది పాటు ఉచితంగా లభిస్తాయి. ఇందులో ఫుల్ ఏఐ సూట్, అడ్వాన్స్ బ్రాండ్ కిట్లు, కంటెంట్ ప్లానర్, ఎక్కువ ఏఐ లిమిట్స్ మరియు 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ వంటి అదనపు ఫీచర్లు ఉంటాయి.
ఈ ఆఫర్ కంటెంట్ క్రియేటర్లకు, యూట్యూబర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జియో పేర్కొంది. రీఛార్జ్ చేసుకున్న తర్వాత, వినియోగదారులు మై జియో యాప్ ద్వారా ఈ సేవలను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.








