రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం కొత్తగా 3 నెలల త్రైమాసిక, 1 సంవత్సరం వార్షిక వ్యాలిడిటీ ప్లాన్లను ప్రవేశపెట్టింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా, నిరంతరాయమైన వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ప్లాన్లను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
ప్రతి జియో ఓటీటీ-పాస్ ద్వారా నెలకు రూ. 1,500 విలువైన ప్రయోజనాలు వినియోగదారులకు అందుతాయి. వీటిలో 15 ప్రీమియం ఓటీటీ యాప్‌లతో పాటు, జియోటీవీ (JioTV) యాప్ ద్వారా 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను వీక్షించే అవకాశం ఉంటుంది.
ఈ కొత్త ప్లాన్లలో భాగంగా రూ. 550 మరియు రూ. 2,000 ధరలతో ఓటీటీ-పాస్‌లను జియో అందుబాటులోకి తెచ్చింది. వీటిని మైజియో (MyJio) యాప్, అధికారిక జియో వెబ్‌సైట్ లేదా సమీపంలోని రీటైల్ అవుట్‌లెట్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.








