పరకాల ప్రభాకర్, 2002లో చేపట్టిన విస్తృత సవరణతో పోలిస్తే ఇప్పటి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తిగా భిన్నంగా ఉందని అన్నారు. పలు రాష్ట్రాల్లో లక్షల మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి, కానీ ఈ తొలగింపులకు సరైన వివరణ ఇచ్చేవారు ఏవరూ లేరని ఆయన అన్నారు.

ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, జవాబుదారీతనం కరువైందని పరకాల విమర్శించారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ప్రశ్నలు మిగిలిపోయాయని, ఆలోపే రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరిగిపోయాయని ఆయన గుర్తు చేశారు.

అంబేడ్కర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పారదర్శకమైన ఓటర్ల జాబితా పునాది అని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను పౌర సమాజం, బుద్ధి జీవులు ప్రశ్నించాలని పరకాల పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విధానాలపై విస్తృత చర్చ అవసరమని పరకాల అన్నారు.