iQOO 16 స్మార్ట్‌ఫోన్ 6.85-అంగుళాల ఫ్లాట్ శాంసంగ్ డిస్‌ప్లేతో రానుంది. ఇది 2K రిజల్యూషన్ మరియు 165Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఫోన్ పనితీరు కోసం క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో చిప్‌సెట్, అడ్రెనో 850 జీపీయూను ఇందులో వాడనున్నారు.
ఈ కొత్త మోడల్‌లో 8,500mAh బ్యాటరీతో పాటు, వేడిని తగ్గించేందుకు రీడిజైన్ చేసిన థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉండనుంది. భద్రత కోసం 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, మెరుగైన హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ కోసం ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్‌ను కంపెనీ పొందుపరిచింది. ఫోన్ వెనుక భాగంలో కొత్తగా డిజైన్ చేసిన కెమెరా మాడ్యూల్, పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండవచ్చని అంచనా.
మెమరీ చిప్ ధరలు పెరగడం వల్ల ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం తక్కువగా ఉందని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై iQOO కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఐఎంఈఐ (IMEI) డేటాబేస్‌లో I2601 మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ ఇప్పటికే కనిపించింది.







