భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ICAR-IARI) వివిధ రీసెర్చ్ ప్రాజెక్టుల కోసం యంగ్ ప్రొఫెషనల్-II ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, ప్లాంట్ పాథాలజీ లేదా లైఫ్ సైన్సెస్ సంబంధిత ఇతర విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు మాలిక్యులర్ క్లోనింగ్, పీసీఆర్ (DNAను కాపీ చేసే సాంకేతికత), న్యూక్లియిక్ యాసిడ్ ఐసోలేషన్ (కణాల నుంచి జన్యు పదార్థాన్ని వేరు చేయడం), ప్లాస్మిడ్ ఐసోలేషన్, రెస్ట్రిక్షన్, లైగేషన్ వంటి ప్రాథమిక మాలిక్యులర్ టెక్నిక్స్‌లో అనుభవం తప్పనిసరి.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30 చివరి తేదీగా సంస్థ నిర్ణయించింది.
ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే, అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి, తుది ఎంపిక చేస్తారు.
ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iari.res.inను సందర్శించవచ్చు.








