హీరోయిన్ కలర్స్ స్వాతి తన రెండో పెళ్లి వివరాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. టాలీవుడ్ దర్శకుడు శ్రీకాంత్ నాగోతితో జరిగిన పెళ్లి ఫోటోలను కూడా ఆమె పోస్ట్ చేసింది.
స్వాతి 2015లో ఫైలెట్ వికాస్ వాసును వివాహం చేసుకున్నది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వారిద్దరి విడాకుల గురించి వార్తలు వచ్చాయి. ఈ విషయంపై స్వాతి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు.
సినిమాల నుండి దూరంగా ఉన్న స్వాతి 'మంత్ ఆఫ్ మధు' చిత్రంతో తిరిగి స్క్రీన్‌కి వచ్చింది. ఈ చిత్రం దర్శకుడు శ్రీకాంత్ నాగోతితో ఆమె పరిచయాన్ని ప్రేమగా మార్చిందని, తర్వాత వివాహం చేసుకున్నారని తెలిసింది. అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.








