హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్కాస్ సలాల ప్రాంతానికి చెందిన ఫహద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బాల్కషర్ (29) జిమ్ కోచ్ మరియు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతని స్నేహితులు సయీద్ బిన్ ఫైసల్ బామ్ మరియు సాలం బామ్‌లతో గత కొన్ని రోజులుగా వివాదాలు జరుగుతున్నాయి.

వివాదాన్ని పరిష్కరించుకుందామని సోమవారం ఉదయం 2:30కి నిందితులు ఫహద్‌ను మరియం కాలనీకి పిలిచారు. అక్కడ చేరుకున్న తర్వాత మాటలు పెరిగి దాడికి దారితీసింది. నిందితులు ముందస్తుగా తీసుకువచ్చిన కత్తులతో ఫహద్‌పై దాడి చేశారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఫహద్‌ను ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు అతను మృతి చెందినట్లు ధృవీకరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం వెదుకుతున్నారు.