గుంటూరులోని కొండా వెంకటప్పయ్య కాలనీలో ఆదివారం పట్టపగలే చిన్నా అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు పథకం ప్రకారం కాపు కాచి, కత్తులతో దాడి చేసి అతడిని హతమార్చారు.
చిన్నా గతంలో జరిగిన ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆ ఘటన తర్వాత అతను తెలంగాణలోని సూర్యాపేటలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే, గుంటూరులో ఉంటున్న తన బాబాయ్ మరణించడంతో, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అతను సూర్యాపేట నుంచి గుంటూరుకు వచ్చాడు.
ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు, అతను నగరానికి వచ్చిన సమయంలోనే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై నగరం పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ హత్యకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.







