అమెరికా చట్టం ప్రకారం ఉద్యోగం ఆధారంగా జారీ చేసే గ్రీన్ కార్డులలో ప్రతి దేశానికి 7 శాతం మాత్రమే కేటాయిస్తారు. భారత్ నుంచి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ఈ పరిమితి కారణంగా గ్రీన్ కార్డులు పొందడం చాలా మందికి కష్టంగా మారింది.
ఈ ఇమ్మిగ్రేషన్ సమస్యల ప్రభావం భారతీయ అమెరికన్ల వివాహ నిర్ణయాలపై స్పష్టంగా కనిపిస్తోంది. తమ ఇమ్మిగ్రేషన్ స్టాటస్ ఎలా ఉంటుందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, చాలా మంది జంటలు తమ వివాహాలను ప్లాన్ చేసుకుంటున్నారు.
దీనివల్ల జంటల మధ్య భిన్నమైన ధోరణులు కనిపిస్తున్నాయి. కొందరు తమ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు త్వరగా వివాహం చేసుకుంటుండగా, మరికొందరు అనిశ్చితి కారణంగా వివాహాలను వాయిదా వేస్తున్నారు.







