గబ్బర్ సింగ్ చిత్రంలోని అంత్యాక్షరి సన్నివేశంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రమేష్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయనను వెంటనే అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.

గబ్బర్ సింగ్ సినిమా తర్వాత రమేష్ కమెడియన్‌గా, నటుడిగా పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటూ, రెండు రోజుల క్రితమే షూటింగ్ లొకేషన్ నుంచి ఒక వీడియోను కూడా ఆయన పంచుకున్నారు.

ప్రస్తుతం రమేష్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ వార్త తెలిసిన వెంటనే రమేష్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తోటి నటులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.