ప్రస్తుతం వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక కొత్త మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'ఆదర్శ కుటుంబం' అనే సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించారు.

ఈ క్రమంలోనే వెంకటేష్ మరో భారీ మల్టీస్టారర్ చిత్రానికి అంగీకరించినట్లు సమాచారం. ఈసారి ఆయన తమిళ స్టార్ నటుడు అజిత్ కుమార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అజిత్ కుమార్ తన అభిమాన దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తర్వాత 'డేర్ డెవిల్' అనే చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. దీనిపై స్పష్టత రావాలంటే కాలమే సమాధానం చెప్పాలి.