వినాయక చవితి పండుగను పురస్కరించుకుని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నివాసంలో గణనాథుడిని ఆరాధించారు. ఎర్రవెల్లిలోని తన ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ పూజల్లో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఆయన భార్య శోభమ్మతో కలిసి గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కేసీఆర్ మనుమడు కల్వకుంట్ల హిమాన్షు రావు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆయన కూడా స్వామివారికి పూజలు చేశారు.

కుటుంబ సభ్యులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో గణేశుడిని పూజించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.