బిగ్‌బాస్ ఫేమ్ అలేఖ్య హారిక సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో టచ్‌లో ఉంటారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. లేత ఎరుపు రంగు చీరలో ఆమె ఎంతో అందంగా కనిపిస్తూ ఫోటోలకు పోజులిచ్చారు.

ఈ ఫోటోలను షేర్ చేస్తూ 'కనులు తెరిచినా, కనులు మూసినా కలలు ఆగవేలా' అనే క్యాప్షన్‌ను అలేఖ్య హారిక జత చేశారు. ఆమె అందాన్ని చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

అలేఖ్య హారిక ఫోటోలపై నెటిజన్లు సరదాగా స్పందిస్తూ, 'లవ్‌లో పడ్డావా ఏంటి హారిక' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తున్నాయి.