ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ఒకేసారి విడుదల చేసింది. మున్సిపాలిటీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది.

మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ సెప్టెంబర్ 7న నోటిఫికేషన్ విడుదలతో మొదలవుతుంది. సెప్టెంబర్ 20న పోలింగ్ నిర్వహించి, సెప్టెంబర్ 23న ఫలితాలను వెల్లడిస్తారు.

మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టెన్సీ (MPTC), జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టెన్సీ (ZPTC) ఎన్నికలకు సెప్టెంబర్ 28న నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్ 11న పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అక్టోబర్ 19న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఫలితాలను ప్రకటించనున్నట్లు షెడ్యూల్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది.