డ్యూరాండ్ కప్ గ్రూప్-డి మ్యాచ్‌లో TRAU FC జట్టు ఇండియన్ నేవీని ఓడించింది. ఈ మ్యాచ్‌లో అఫ్రిది బుయమయుమ్ రెండు గోల్స్ సాధించగా, అందులో 60వ నిమిషంలో చేసిన గోల్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

ఇండియన్ నేవీ ఆటగాళ్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై ఏకంగా 26 సార్లు దాడులు చేసినప్పటికీ, కేవలం ఒక్క గోల్ మాత్రమే చేయగలిగారు. TRAU FC గోల్ కీపర్ తాజుద్దీన్ అద్భుతమైన ప్రతిభతో ప్రత్యర్థి ప్రయత్నాలను పదేపదే అడ్డుకున్నారు.

ఈ విజయంతో TRAU FC గ్రూప్-డి పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మూడు మ్యాచ్‌లు ఆడిన ఇండియన్ నేవీ మూడు పాయింట్లతో తన గ్రూప్-స్టేజ్ ప్రయాణాన్ని ముగించింది.