తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను వెండితెరపైకి తీసుకువస్తున్నారు. ఇండియన్ పీపుల్స్ ఫిలిం ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2026 ఆగస్టు 30న పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈ సినిమా పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.
పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా గోదావరిఖని మున్సిపల్ ఆఫీస్ టీ జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కళాకారులు పూలమాలలు వేశారు. అనంతరం అక్కడి నుంచి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలోని కళాకారులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ఈ సినిమాను 1000 మంది సహా నిర్మాతల భాగస్వామ్యంతో రూపొందిస్తున్నట్లు దర్శకుడు సేనాపతి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుండి 32 మందిని నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ యాత్రను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.








