దేవరకొండ రూరల్ మండలంలోని మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రసిద్ధ మాల్గడ్డ శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగుడు ఆలయంలోకి ప్రవేశించి, హుండీ తాళాలను పగలగొట్టి అందులోని నగదును అపహరించుకుపోయాడు.

ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన కమిటీ సభ్యులు, దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించినట్లు తెలిపారు.

ఈ ఘటనపై ఆలయ కమిటీ సభ్యులు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ వెంకట్ రెడ్డికి ఫిర్యాదు అందజేసినట్లు వారు పేర్కొన్నారు.