తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం దేవాదాయ శాఖ పరిధిలోని అత్యున్నత స్థాయి రాష్ట్ర సమితిని పునర్వ్యవస్థీకరించింది. ఈ కమిటీలో ప్రముఖ మహిళా నిర్మాత అర్చన కల్పాత్తిని సభ్యురాలిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హిందూ ధర్మాదాయ శాఖ పరిధిలో వార్షిక ఆదాయం ₹10 లక్షలకు పైగా ఉన్న ప్రముఖ ఆలయాలకు పారంపర్యేతర (నాన్-హెరిడిటరీ) ట్రస్టీలను ఎంపిక చేసే బాధ్యతను ఈ కమిటీ చూస్తుంది. ఈ ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ కమిటీని కొత్తగా ఏర్పాటు చేసింది.

మొత్తం ఏడుగురు సభ్యులతో ఈ కమిటీని ప్రభుత్వం రూపొందించింది. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల నిర్వహణలో కీలక పాత్ర పోషించే ట్రస్టీల ఎంపికలో ఈ కమిటీ నిర్ణయాలు కీలకం కానున్నాయి.