ప్రకృతి మనకు ఎన్నో రకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాలను ఇచ్చింది. వీటిలో ముఖ్యంగా పండ్లు, కాయలు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఇలాంటి పోషకాలున్న ఒక విదేశీ పండు ఇప్పుడు మన దక్షిణ భారత రాష్ట్రాల్లో సాగవుతోంది. కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఈ పండును ఎక్కువగా పండిస్తున్నారు, దీంతో ఇది మనకు సులభంగా అందుబాటులోకి వచ్చింది.

ఈ పండు పేరు రాంబుటాన్. ఇది చూడటానికి లిచీ పండును పోలి ఉంటుంది. అయితే, దీని పైన ఎర్రటి రంగులో మెత్తటి ముళ్లు ఉంటాయి.

రుచితో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఈ పండును స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేయవచ్చు.