నేటి ఆధునిక యుగంలో మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు పురుషుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం నగరాల్లో ప్రతి వీధిలోనూ టీ స్టాళ్లలాగా కృత్రిమ గర్భధారణ కేంద్రాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి ప్రధాన కారణం చాలా మంది పురుషులలో వీర్యకణాల కొరత ఉండటమేనని నిపుణులు చెబుతున్నారు.