గాంధీ భవన్‌లో జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కొత్తగా నియమితులైన ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ బీఎం సందీప్ కుమార్ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో మరింత మెరుగైన మెజారిటీ సాధించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు పునరుత్సాహంతో, ఐక్యతతో పని చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనితీరు దేశం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. అందరి సమిష్టి కృషితో 64 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, రాష్ట్రంలో జరిగిన అన్ని ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించిందని తెలిపారు.

ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితులు వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన చెప్పారు. అయితే, తెలంగాణకు తగిన మద్దతు, సహకారం అందించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

గత ఏఐసీసీ ఇన్‌చార్జుల సేవలను ఆయన కొనియాడారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రేణులు కృషి చేయాలని సూచించారు.

సోనియా గాంధీ రాసిన 'బిలాంగింగ్' పుస్తకం దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకుందని తెలిపారు. సోనియా గాంధీ త్యాగాలు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగాలు ప్రజల జ్ఞాపకాల్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సైద్ధాంతిక విధానాలను ఐక్యతతో తిప్పికొట్టి కేంద్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు.